భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 73వ పుట్టినరోజు సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా వేడుకలు నిర్వహించారు. డైమండ్ గ్రూప్స్ అధినేత, వాసవి క్లబ్ ఐపిసి మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
రైతు బజార్ డైమండ్ బేకరీ వద్ద జరిగిన ఈ వేడుకల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి కేక్ కట్ చేసి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఐపిసిలు మిట్టపల్లి విజయభాస్కర్ రావు (డిస్ట్రిక్ట్ ఐ అండ్ ఆర్గాన్ డొనేషన్ ఇంచార్జ్), సామా శ్రీనివాస్, జోన్ చైర్ పర్సన్ పాంపాటి రామలింగయ్య, కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ భవిరిశెట్టి మధు, డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ పూరి శంకరయ్య, జస్టిస్ అడ్వకేట్స్ క్లబ్ ప్రెసిడెంట్ సోమ దిలీప్, కపుల్స్ క్లబ్ జాయింట్ సెక్రటరీ గుండారవి గుప్త పాల్గొన్నారు. వీరితో పాటు రమేష్, వంశీ, రోజా ప్రియాంక, అనిత, పండు మట్టయ్య తదితరులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.












