నిర్మల్ జిల్లా మండలంలోని పార్టీ(బి) గ్రామంలో గురువారం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు వారి ఆరాధ్య దైవం విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి, విశ్వకర్మ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు లింబాద్రి మాట్లాడుతూ, విశ్వకర్మ బ్రాహ్మణులందరికీ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించాలని, వారికి తోడ్పాటుగా రాయితీతో కూడిన రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ అధ్యక్షులు మండాజి లింబాద్రి తో పాటు గ్రామ సర్పంచ్ మడి ప్రవీణ్, మాజీ జెడ్పిటిసి వాన్కరే మోహన్, మాజీ సర్పంచులు కండెల రాజన్న, తూము రాజేశ్వర్, మల్లన్న, చంద్రశేఖర్, మాజీ ఎంపిటిసి కానోబ, విశ్వకర్మ మండల అధ్యక్షుడు కట్టాల లక్ష్మణ్, మాజీ విశ్వకర్మ మండల అధ్యక్షుడు గాంధారి సాయినాథ్, సంఘం గ్రామ మాజీ అధ్యక్షులు బ్రహ్మ దాస్, గ్రామ పంచాయతీ సభ్యులు, విశ్వకర్మ కార్యదర్శులు, సంఘ సభ్యులు చంద్రకాంత్, నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.