50వ డివిజన్, పెద్ద రామ మందిరం, Nizamabad, Telangana (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 17
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో 100 గోవులకు గో ఆహారాన్ని పంపిణీ చేశారు. 50వ డివిజన్ పరిధిలోని పెద్ద రామ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దినేష్ కులకర్ణి పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలోని 50వ డివిజన్ పరిధిలోని పెద్ద రామ మందిరంలో 100 గోవులకు గో ఆహారాన్ని పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డివిజన్ కార్పొరేటర్ దినేష్ కులకర్ణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ దినేష్ కులకర్ణి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గోదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గోవుల ఆరోగ్యంతో పాటు నగర ప్రజలు సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక గల్లీ వాసులతో పాటు పెద్ద రామ మందిరం విద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.












