భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి, రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసనకారులు నిరాహార దీక్ష చేపట్టారు.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ బి.ఆర్. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి, రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మాల మహానాడు జిల్లా ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్ మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, హక్కులను అందించేందుకు విశేష కృషి చేశారని తెలిపారు. అంబేద్కర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు.
హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని, ఆయన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హమారా ప్రసాద్‌ను అరెస్టు చేసే వరకు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు జనరల్ సెక్రటరీ పెరుమాడ్ల రాజా నర్సింలు, ఆడప శ్యామ్, గోనుగొప్పుల లింగం, నాలుక స్వామి, కంకణాల జగన్, మనోజ్, చెవుల రవిందర్ తదితరులు పాల్గొని నిరాహార దీక్ష చేపట్టారు.
జై భీమ్ జై రాజ్యాంగం నినాదాలతో వారు తమ నిరసనను తెలిపారు.












