గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారి అభివృద్ధికి కృషి చేశారని నాయకులు కొనియాడారు. ఈ నేపథ్యంలో, సారంగాపూర్ మండలం దుర్గా నగర్ తండాలో కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు.
గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి వారి అభివృద్ధికి తోడ్పడ్డారు. అలాగే, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను రైతులకు పంపిణీ చేశారు. తండాల అభివృద్ధికి వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కూడా మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకే దక్కుతుందని నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో, నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సారంగాపూర్ మండలం మహావీర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గా నగర్ తండాలో పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. ఈ పాలభిషేకం కార్యక్రమంలో పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపల్లి రామ్ కిషన్ రెడ్డి, మండల కన్వీనర్ దేవి శంకర్, మహేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, పార్టీ కన్వీనర్ లక్ష్మణ చందా, జీవన్ రావు, దత్తురాం పవర్ రాజు, లక్ష్మీనారాయణగౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ బోసాని, భోజన్న, గడ్డల చిన్నయ్య, మోతే వారి లక్ష్మణ్, చాట్ల చిన్నయ్య, బుర్రి రాజు, ధనుంజయ్ శ్రీధర్, ప్రహల్లాద, గజేందర్, మాజీ సర్పంచ్ జాన్ ఎక్స్ పోశెట్టి, గణేష్ రంగారావు నాయక్ పాల్గొన్నారు.












