బైంసా పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులు బ్యాంకింగ్ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలని, పొదుపు అలవాట్లు పెంపొందించుకోవాలని సూచించారు.
విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యతతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కలిగి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. బైంసా పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే విద్యార్థులు బ్యాంకింగ్ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండటంతో పాటు పొదుపు అలవాటును పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో వివిధ రకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా సూచించారు. సైబర్ మోసాలపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి , బ్యాంకింగ్ సేవలను సురక్షితంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.












