నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం) సందర్భంగా నిర్వహించాల్సిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంపై విద్యాశాఖ అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఏటా వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే ఆనవాయితీ ఉంది. సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెలల్లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హులను ఎంపిక చేస్తారు.
ప్రతి ఏటా వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం) సందర్భంగా నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంపై నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా జూలై లేదా ఆగస్టు నెలల్లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీల ద్వారా పరిశీలించి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అనివార్య కారణాలవల్ల జిల్లాస్థాయిలో కార్యక్రమం జరగకపోతే, దానికి ఒకటి రెండు రోజులు అటు ఇటుగా మార్చి అదే వారంలో పూర్తి చేసేవారు. భారతదేశ రెండో రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా గౌరవార్ధం ఉపాధ్యాయ దినోత్సవం జరపాల్సి ఉన్నప్పటికీ, నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి నేటికీ కార్యక్రమం నిర్వహించలేదు. ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించకుండా, గురుపూజోత్సవం కార్యక్రమాన్ని చేపట్టకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను ప్రభుత్వాలు, విద్యాసంస్థలు ఘనంగా సత్కరించడం ఆనవాయితీ.
అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే సద్గురులకు సన్మానించాల్సిన నిజామాబాద్ డిఇఓ నేటికీ సన్మాన కార్యక్రమం నిర్వహించకపోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎంపిక ప్రక్రియలో జాప్యంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడైనా తక్షణమే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు గ్రహీతల జాబితా ప్రకటించి, వారికి సన్మానం చేసి గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించాలని పిఆర్టియు తెలంగాణ పక్షాన జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.












