మండలంలోని గడ్ చంద్ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థినులు సీటు సాధించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి కరిపే శోభారాణి శ్యాంసుందర్ విద్యార్థినులను అభినందించారు.
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని, గడ్చందా గ్రామానికి చెందిన పినాని త్రిష, బంతి శ్రావణి అనే ఇద్దరు విద్యార్థినులు ప్రతిభ కనబరిచి సీటు సాధించారు. ఈ విజయం పట్ల గ్రామ సర్పంచ్ శ్రీమతి కరిపే శోభారాణి శ్యాంసుందర్ హర్షం వ్యక్తం చేశారు. సీటు సాధించిన కుమారి పినాని త్రిష, కుమారి బంతి శ్రావణిలను గ్రామ సర్పంచ్ కరిపే శోభారాణి శ్యాంసుందర్, చైర్మన్ రత్నాకర్ రావు, మాజీ సర్పంచులు వెంకట్ రావు, గంగన్న, మాజీ సాయాన్న, చైర్మన్ మురళిధర్ రావు మరియు గ్రామస్తులు అభినందించి, శాలువతో ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించడం పట్ల సర్పంచ్, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా అభినందించారు.












