మిర్యాలగూడమండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యక్రమా లపై సమీక్ష సమావేశం మండల ప్రత్యేక అధికారి
డాక్టర్ జూలకంటి వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసిల్దారు పి శ్రీనివాస్ కోరారు.ఎరువులు విత్తనాల సరఫరా పై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ రైతులకు నాణ్యమైన ఇన్పుట్ లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ అధికారి రుషేంద్ర మణితెలిపారు. విద్యార్థులకు పాఠ్యపుస్త కములు వర్క్ బుక్స్ నోట్ బుక్స్ రెండు జతల యూనిఫాం పంపిణీ చేసినట్లు మండల విద్యాధికారి ధర్మానా యక్ తెలిపారు. పశువులకు టీకాలు, నట్టల నివారణ మందులు కృత్రిమ గర్భధారణ చేసినట్లు పశుసంవర్ధక అధికారి జ్ఞానేశ్వర్ ప్రసాద్ తెలియజేశారు.తక్కెలపాడు ఆలగడప లక్ష్మీపురంలో ప్రారంభం చేయని వివో బిల్డింగులు వెంటనేప్రారంభించాలని, ఎస్. బి.ఎం నిధుల కింద మంజూరు చేయబడిన డ్రైన్ ఎండ్ కమ్యూనిటీ సోక్ పిట్లు తొందరగా పూర్తి చేయాలనిసర్పంచులకు పంచాయతీరాజ్ ఏఈ వరలక్ష్మి కోరారు. విద్యుత్తు ఎఇ అమర్ సింగ్ గైర్హాజర్, లైన్ మెన్ హాజరైనందుకు ఏ ఈ సమావేశం రావాల్సిందేనని సర్పంచ్ డిమాండ్ చేశారు. వాటర్ ట్యాంక్ తండా దగ్గర ఆర్ 5 ఎత్తిపోతల పథకానికి చెందిన రిపేర్ పనులు పూర్తి చేసినట్లు నీటిపారుదల ఏఈ ప్రభాకర్ తెలిపారు.
గర్భిణీ స్త్రీలకు టిటి మొదటి రోజు రెండవ డోసు ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు అందజేసినట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 153 సాధారణ కాన్పులు చేయించు కున్నారని 316 మంది పిల్లలకు బీసీజీ వేసినట్లు 630 మందికి మీజిల్స్ వేసినట్లు 1390 ల్యాబ్ పరీక్షలునిర్వహించినట్లు పీహెచ్సి డాక్టర్ మొహీద్ తెలిపారు. మిర్యాలగూడ నుండి దిలావర్పూర్ వరకు రోడ్డు వెడల్పు పని టీక్యతాండ పనులు కొనసాగుతున్నాయని ఉన్నదని ఆర్ అండ్ బి ఏ ఈ తెలిపారు. బిందు సేద్య పరికరాలపై 90 శాతం, ఎస్సీ ఎస్టీ రైతులకు 80 శాతం చిన్న, సన్న కారు రైతులకు 70 శాతం పెద్ద రైతులకు రాయితీ కల్పించుతున్నారని, 12.20 ఎకరాల వరకు మాత్రమే డ్రిప్ రాయితీ ఇవ్వడం జరుగు తుందని, ఆయిల్ ఫాం సాగు చేసుకునే రైతులు దరఖాస్తు చేసుకోవాలని హార్టికల్చర్ అధికారి ఎస్ కే నసీమా తెలిపారు. ప్రతి గ్రామంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారు ఫారం తవ్వుకొనుటకు రైతులకు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తవ్వుకొనుటకు జలసిరి పనులపై అవగాహన పెంచుటకు గ్రామాలలో తెలియజేయాలని ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకట్ రెడ్డి ఏపిఎం లకు ఆదేశించారు.గ్రామాలలో ప్రారంభించని ఇందిరమ్మ ఇండ్లు రద్దు చేయుటకు లబ్ధిదారుల పేర్లు తెలియజేయాలని, వి బి జి రాంజీ పథకం యందు ప్రతి ఇంటికి మ్యాజిక్ సోక్ పిట్, కమ్యూనిటీ సోక్ పిట్, బోర్ వెల్ రీఛార్జి కట్టడాలు, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మించాలని, ప్రతి రైతుకు ఫారం పాండ్ కట్టుకోవడం వల్ల చేప పిల్లల పెంచుకోవడానికి, తీగజాతి పంటలు వేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఎంపీడీవో శేషగిరి శర్మ తెలిపారు. లేబర్ రిపోర్టు పెరగడా నికిఅవకాశంఉంటుందని,మిర్యాలగూడ మండలంలో మంజూరు చేసిన 12 అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్స్ నిర్మాణం పనులు ప్రారంభించాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో శేషగిరి శర్మ ఆదేశించారు. మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శి సర్పంచులుపాల్గొన్నారు.












