రంగారెడ్డి, 17 September
జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ను పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అమర వీరుల స్తూపం, ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ను పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అమర వీరుల స్తూపం, ఎంపీడీవో కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, ఆర్డీవో సరిత, ఎంపీడీవో శ్రీకాంత్, తహసీల్దార్ నాగయ్యతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ విమోచన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన యోధులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా షాద్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం, ప్రజాస్వామ్యం కోసం జరిగిన ఉద్యమాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. నిజాం సైనిక దళాలైన రజాకార్ల దాడులు, అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు యోధులు, కాంగ్రెస్ నాయకులు, సామాన్య ప్రజలు వివిధ రూపాల్లో పోరాటాలు సాగించారని తెలిపారు. ప్రజల పోరాటాలకు తోడు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం నిజాం పాలన ముగిసి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని పేర్కొన్నారు.
తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం కోసం వారు చేసిన త్యాగాల స్ఫూర్తితో ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా పోరాట చరిత్రకు తగిన గౌరవం లభిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ రఘు నాయక్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకట్ రాంరెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ చల్ల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ తుపాకుల శేఖర్, సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, దంగు శ్రీనివాస్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాయ్ కల్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు నల్ల మోని శ్రీధర్, కౌన్సిలర్లు అగ్గనూర్ విశాల విశ్వం, పెంటయ్య, రాజు నాయక్, బచ్చలి నరేష్, కొప్పునూర్ ప్రవీణ్, దిలీప్ కుమార్, జామల్ పూర్ సంతోషి బాయి, మురళి మోహన్ అప్పి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, ఎస్సీ విభాగం నేత జాంగారి రవి, నేతలు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు వావిలాల సుజీవన్, సయ్యద్ ఖదీర్, సోలి పూర్ శ్రీశైలం గౌడ్, జేఏసీ నేతలు జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరణకర్, నక్క బాలరాజు, రాము, గోధ మాధవులు యాదవ్, ముబరక్, సాదక్, గోధా మదవులు, డాకం మనీష్, రవితేజ చిన్న, తంగేడ్ పల్లి శంకర్, జాంగారి జంగయ్య, మోహన్ నాయక్, నిరటి వాసు, మంగ అశోక్, జగదీష్, సుమన్ నాయక్, బీరప్ప, శేఖర్, కృష్ణ, మట్ట వెంకటేష్, రాజు పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.












