భక్తుల సౌకర్యార్థం బాసరలో ఉచిత బస్సు సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాసర శాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల వ్యయంతో బస్సును సమకూర్చారు. ఈ సేవలను నేటి నుంచి భక్తులు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
భక్తుల సౌకర్యార్థం బాసరలో ఉచిత బస్సు సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాసర శాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల వ్యయంతో బస్సును సమకూర్చారు. బస్సు ప్రారంభానికి ముందు బాసర ఆలయ ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనీ దేవి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ జీ. అశోక్ కుమార్, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బస్సు సేవలను ప్రారంభించారు.
బాసర ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బస్సును నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం నుంచి భక్తులు ఉచితంగా బస్సు సేవలను వినియోగించుకోవచ్చని వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు రాకపోకలలో మరింత సౌకర్యం కల్పించేందుకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. భక్తుల సౌకర్యం కోసం రూ.25 లక్షలతో బస్సును సమకూర్చిన ఎస్బీఐ శాఖకు ఆలయ అధికారులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.











