ఆదిలాబాద్, 10 September
ఆదిలాబాద్ పట్టణంలోని కే ఆర్కే కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ లీకవడంతో గురువారం మరమ్మతు పనులు చేపట్టారు. వార్డు కౌన్సిలర్ దుమ్మని రజిత రాము పనులను పర్యవేక్షించారు.
కే ఆర్కే కాలనీలో పైప్లైన్ లీకేజీకి మరమ్మతులు ఆదిలాబాద్: పట్టణంలోని ఏడో వార్డు కే ఆర్కే కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ లీకేజీకి గురికావడంతో గురువారం మరమ్మతు పనులు చేపట్టారు. వార్డు కౌన్సిలర్ దుమ్మని రజిత రాము పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లీకేజీ సమస్యను గుర్తించిన వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులు లింగంపల్లి శశికాంత్, ముస్లె ఈశ్వర్, ద్యావంత్ రమేష్, ఎల్చాల పోచ్చన్న తదితరులు పాల్గొన్నారు.












