నిర్మల్, 9 September
కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం భద్రతా గోదామును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా గోదాం వసతులను, భద్రతా ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా మనో రంజని తెలుగు టైమ్స్ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం భద్రతా గోదామును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన గోదాం వసతులను, భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాములోని ఈవీఎంల వివరాలకు సంబంధించిన వివిధ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కలెక్టర్, సీసీ టీవీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం ప్రాంగణంలోని అగ్నిమాపక పరికరాలు, అత్యవసర భద్రతా వ్యవస్థలను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ... "గోదాం వద్ద ఎలాంటి లోపాలకు తావులేకుండా పటిష్టమైన భద్రతను నిర్వహించాలి. సీసీ కెమెరాల ద్వారా పోలీసు యంత్రాంగం 24 గంటలూ నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలి. ఏ క్షణంలోనైనా ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా అగ్నిమాపక వ్యవస్థను ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంచాలి" అని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, భద్రతా సిబ్బంది మరియు సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.











