బోథ్ గ్రామం, 15వ వార్డు, బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
బోథ్ గ్రామపంచాయతీ పరిధిలోని 15వ వార్డులో విద్యుత్ స్తంభాలు లేకపోవడం, విద్యుత్ సౌకర్యం కొరవడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల మంచినీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోందని వార్డు సభ్యుడు షేక్ షాకీర్ తెలిపారు.
15వ వార్డులో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి బోథ్: బోథ్ గ్రామపంచాయతీ పరిధిలోని 15వ వార్డులో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్డు సభ్యుడు షేక్ షాకీర్ తెలిపారు. విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో మంచినీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్–2 అధికారి చవాన్ జైవంత్కు వార్డు సభ్యులు వినతిపత్రం అందజేశారు. 15వ వార్డులో అవసరమైన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. వినతిపత్రంపై అధికారి సానుకూలంగా స్పందించి, సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు షేక్ షాకీర్ తెలిపారు.


