Vijayawada, 9 September
మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 8వ తరం మునిమనవడు, బ్రహ్మంగారి మఠాధిపతి శ్రీశ్రీ వెంకటాద్రి స్వామి, విజయవాడలో ప్రముఖులను దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు చిప్పాడ చందు నివాసానికి విచ్చేసి, ఆయన కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.
చిప్పాడ చందు కుటుంబాన్ని ఆశీర్వదించిన వెంకటాద్రి స్వామి విజయవాడ: మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 8వ తరం ముని మనవడు, బ్రహ్మంగారి మఠాధిపతి శ్రీశ్రీ వెంకటాద్రి స్వామి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు, విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు చిప్పాడ చందు నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చందు, ఆయన కుటుంబ సభ్యులను స్వామి ఆశీర్వదించారు. అనంతరం నిడమానూరుకు చెందిన ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్ అధ్యక్షుడు కే. శ్రీనివాస చక్రవర్తి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కూడా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక విషయాలపై చర్చించారు.












