బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 08
మండలంలోని కైలాస్ టేకిడిలో గురువారం పొలాల పండగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకలను ఈసారి శ్రీ పరమపూజ్య జాగృత్ సంత్ లింభాజీ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ పండగలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
కైలాస్ టేకిడిలో గురువారం పొలాల ( మండలంలోని శ్రీ శిఖర్ కైలాస్ టేకిడిలో గురువారం పొలాల పండగను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ వేడుకలను ఈ ఏడాది కూడా శ్రీ పరమపూజ్య జాగృత్ సంత్ లింభాజీ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.శ్రావణమాసం నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు, చివరి రోజైన అమావాస్య సందర్భంగా గురువారం జరిగే పొలాల పండగలో పాల్గొననున్నారు. వివిధ గ్రామాల నుంచి ప్రత్యేకంగా అలంకరించి తీసుకువచ్చే బసవన్నలకు భాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలకనున్నారు.అనంతరం తోరణాన్ని తెంపి బసవన్నలతో మందిర ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రదక్షిణ అనంతరం శ్రీ లింభాజీ మహారాజ్ బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. మంగళహారతులు ఇచ్చి, మంగళాష్టకాలతో అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు.భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని బసవన్నలను తిరిగి తమ గ్రామాలకు తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.












