బుధవారం (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
మహారాష్ట్రకు చెందిన డీజే నిర్వాహకులు నిర్మల్ జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల స్థానిక డీజే నిర్వాహకులు ఉపాధి కోల్పోతున్నారని ఆరోపిస్తూ, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. వంద మందికి పైగా స్థానిక డీజే నిర్వాహకులు ఈ సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.
మహారాష్ట్ర డీజేలతో స్థానిక నిర్వాహకులకు ఉపాధి నష్టం ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసిన స్థానిక డీజే నిర్వాహకులు ( మహారాష్ట్రకు చెందిన డీజే నిర్వాహకులు నిర్మల్ జిల్లాకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల స్థానిక డీజే నిర్వాహకులు ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారని ఆరోపిస్తూ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వంద మందికి పైగా డీజే నిర్వాహకులు ఈ సందర్భంగా తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్రలో డీజేల వినియోగంపై ఆంక్షలు ఉండటంతో అక్కడి నిర్వాహకులు నిర్మల్ జిల్లాకు వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దీంతో స్థానికంగా డీజే వృత్తిపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని వారు తెలిపారు. అంతేకాకుండా అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం వల్ల శబ్ద కాలుష్యం పెరిగి ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని పేర్కొన్నారు.స్థానిక డీజే నిర్వాహకుల సమస్యలను ఎస్పీ సానుకూలంగా విన్నారు. మహారాష్ట్ర నుంచి నిర్మల్ జిల్లాకు డీజేలు రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అధిక శబ్దం వల్ల ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నిర్దేశించిన శబ్ద పరిమితులకు లోబడి కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిబంధనలను పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు శాఖకు సహకరించాలని డీజే నిర్వాహకులను కోరారు.












