నిర్మల్, 7 September
అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాటలో అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
జగదీష్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాటలో అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. అనంతరం జగదీష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.












