బాసర, 8 September
శాంతియుత నిరసనలపై దాడులు, మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత ప్రవర్తన, వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి హరీశ్ రావు గాయపడిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ మండల కేంద్రంలో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
శాంతియుత నిరసనలపై దాడులు ఎందుకు? మహిళా ఎమ్మెల్యేల పట్ల ఈ అనుచిత ప్రవర్తన ఎందుకు? కాంగ్రెస్ పాలనపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న BRS ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, మహిళా ఎమ్మెల్యేల పట్ల దుశ్శాసనుడిలా వ్యవహరించడం, అలాగే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు, మాజీ మంత్రి హరీశ్ రావు గార్లను గాయాలపాలు చేసిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ... ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో BRS మండల కన్వీనర్ కొర్వా శ్యామ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో BRS మండల కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


