లోకేశ్వరం, 7 September
బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మండలంలో పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీ ముట్టడి పిలుపు.. బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు మండలంలో పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చేపట్టనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు సోమవారం ఉదయం నుంచే అప్రమత్తమయ్యారు. మండల ప్రధాన కార్యకర్త కొందాపురం రాజశేఖర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. హామీల అమలు కోసం ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.












