యాదాద్రి భువనగిరి, 7 September
జిల్లా స్వర్ణగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి నృత్య కళా పోటీల్లో నిర్మల్‌కు చెందిన బాలిక గుర్రం సంహిత కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణగిరి బాలాజీ అవార్డును అందుకుంది. ఐదేళ్ల వయసులోనే ఆమె ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
స్వర్ణగిరిలో నిర్మల్ చిన్నారికి అరుదైన గౌరవం కూచిపూడి నాట్యంలో ప్రతిభకు ‘స్వర్ణగిరి బాలాజీ అవార్డు’ నిర్మల్: జిల్లా స్వర్ణగిరి ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య కళా పోటీల్లో నిర్మల్‌కు చెందిన చిన్నారి గుర్రం సంహిత కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ కనబరిచి ‘స్వర్ణగిరి బాలాజీ అవార్డు’ అందుకుంది. నిర్మల్ పట్టణానికి చెందిన గుర్రం మహిత, ప్రణయ్ దంపతుల కుమార్తె సంహితకు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల కుటుంబ సభ్యులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కేవలం ఐదేళ్ల వయసులోనే కూచిపూడి నాట్యంపై ఆసక్తి పెంచుకున్న సంహిత.. భక్తి భావాన్ని ప్రతిబింబించేలా హావభావాలు, అభినయంతో నృత్యాన్ని ప్రదర్శించింది. ఆమె ప్రదర్శనకు కళాక్షేత్రంలో హాజరైన సభికులు చప్పట్లతో అభినందించారు. చిన్నారి ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకోవడంతో నిర్వాహకులు ఆమెను అవార్డుతో సత్కరించారు. చిన్న వయసులోనే నృత్యరంగంలో ప్రతిభను చాటుతూ రాష్ట్రస్థాయి వేదికపై అవార్డు అందుకోవడం పలువురు అభినందించారు. భరతనాట్యంతో పాటు భారతీయ కళలు, సంస్కృతిపై చిన్నారికి మరింత ఆసక్తి పెంచేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. సంహితకు పలువురు కళాకారులు, ప్రముఖులు, బంధుమిత్రులు అభినందనలు తెలియజేశారు.












