దిమ్మాదుర్తి గ్రామానికి చెందిన అల్లపు శంకర్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
శంకర్ గారి మృతిపట్ల కూచాడి శ్రీహరిరావు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అల్లపు శంకర్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.












