జీవనది గోదావరిని కాపాడుకోవడం, భవిష్యత్తు తరాలకు సుస్థిర పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మండలం గోలివాడ పుష్కరఘాట్ వద్ద గోదావరి నది తీరంలో క్లీన్లీనెస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) సభ్యులు, -రామగుండం ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
నది తీరంలో చేపట్టిన స్వచ్ఛత పనుల్లో పాల్గొని, చెత్తాచెదారాన్ని తొలగించారు. తొలగించిన వ్యర్థాలను ట్రాక్టర్లలో తరలించి, నిర్దేశిత ప్రాంతాల్లో పడవేశారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఈ.డి. (ఆర్అండ్ టి) చందన్ కుమార్ సమంత, ప్రెస్ క్లబ్ పాత్రికేయులను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు, గోలివాడ, గ్రామ ప్రజలతో కలిసి పాత్రికేయులు ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో , రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంజాల రాధాస్వామిగౌడ్ తో పాటు సభ్యులు కాంపెల్లి మల్లిఖార్జునస్వామి, దాసరి విష్ణుకుమార్, పల్లికొండ మధూకర్, తగురం కరుణాకర్, పూసాల రవి, తూండ్ల శ్రీనివాస్ పటేల్, నగునూరి రాజయ్య గౌడ్ లు పాల్గొన్నారు.












