సారాంశం
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలో తన స్వగ్రామమైన కేతావత్ తండాలో ఎమ్మెల్సీ మొక్కలు నాటారు.
ముఖ్య విషయాలు
- 1పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు.
- 2పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని ఎమ్మెల్సీ తెలిపారు.
- 3శుక్రవారం మండలంలో తన స్వగ్రామమైన కేతావత్ తండాలో ఎమ్మెల్సీ మొక్కలు నాటారు.
- 4గ్రామంలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన కోరారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలో తన స్వగ్రామమైన కేతావత్ తండాలో ఎమ్మెల్సీ మొక్కలు నాటారు.
గ్రామంలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన కోరారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని ఎమ్మెల్సీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలు, చలపతిరావు, హనుమంతుతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.