దామరచర్ల మండలం
దిలావర్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం
తెలుగు ఉపాధ్యాయు ల కాంప్లెక్స్ సమావే శంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి సైదా నాయక్ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సైదా నాయక్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ ప్రజల వెట్టి చాకిరి విముక్తి కోసం దొర,దేశముఖ్, గుండాలను ఎదిరించి ఆంధ్ర మహాసభ సంఘం కార్యకలాపాల సహకారంతో తాను పండించిన పంటను దొరకు చెందకుండా తన వెంట పోరాటం చేసినటువంటి ఆంధ్ర మహాసభ కార్యకర్తలకు పంచిన తెగువ, ధైర్యం ఐలమ్మదని అందుకే ప్రతి ఒక్కరూ ఐలమ్మను ఆదర్శంగాతీసుకోవాలన్నారు.ఈ కార్యక్ర మంలో తెలుగు జిల్లాస్థాయి శిక్షకులు గుడిపాటి కోటయ్య, కోడి రెక్క జయరాజ్ అలుగోముల శ్రీను శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ నాగరాణి, నాగమణి, జయమ్మ, అనిత, అప్పమాంబ పద్మ, విజయ, తదితరులు పాల్గొన్నారు.












