మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లోగల చైతన్య పాఠశాల ఇంగ్లీష్ మీడియంలో శుక్రవారం కిడ్డి (మినీ)లైబ్రరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మరో గ్రంథాలయం ఉద్యమ నాయకులు కస్తూరి ప్రభాకర్, ఎన్.
సంజీవరెడ్డి, అంబటి నాగయ్య మిర్యాలగూడ లైబ్రరీ యన్ సుధాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠణంగురించి, పుస్తకాలు ఎలా సద్వినియోగం చేసుకోవాలనివిషయాన్ని తెలియజేశారు.
సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించి విద్యార్థులు విజ్ఞానానికి దూరం అవుతున్న సందర్భాన్ని వివరిస్తూ పుస్తకాలపై మక్కువ పెంచుకునే విధంగా అవగాహనకల్పించారు. చైతన్య పాఠశాల కరస్పాండెంట్ ఆర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ మా పాఠశాలలో విద్యార్థులు కోసం 2,500 పుస్తకాలతో కిడ్డి లైబ్రరీ ప్రారంభించు కోవడం ఎంతో ఆనందంగాఉందన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ కి దూరంగా ఉండి పుస్తకాలపై అసక్తి కనబరచాలని తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షను నెరవేర్చా లని, పుస్తక విజ్ఞానం భవిష్యత్తులో ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆర్. జయంతి మాట్లాడుతూ పిల్లలలో ఈ మధ్యకా లంలో సెల్ఫోన్ ఎక్కువ గా వాడటం వల్ల పుస్తకాలకు దూరమవు తున్నారన్నారు.ఇలాంటి సంఘటన భవిష్య త్తులోచాలా ప్రమాదకరమని భావించి, చైతన్య పాఠశాల కిడ్డి (మినీ) లైబ్రరీ ప్రారంభించడం జరిగిందన్నారు. విద్యార్థులుప్రతిరోజు లైబ్రరీ వెళ్లే విధంగా టైం టేబుల్ తయారు చేసి ప్రతి ఒక్క విద్యార్థి పుస్తకాలను చదివే విధంగా అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకునే విధంగా సంవత్సరంలో కొన్ని పుస్తకాలు విద్యార్థులచే చదివించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకుతీసుకురావడం జరిగిందన్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్క విద్యార్థి పుస్తకాలు చదివే విధంగా మాకు సహకరించాలని కోరారు.ఈకార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రు లు, ఉపాధ్యా యినీలు, ఉపాధ్యాయు లు పాల్గొన్నారు.












