మండలం మాంజరి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు, చాక్లెట్లు, కలములు, నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలకు 43 అంగుళాల డిజిటల్ దృశ్యశ్రవణ పరికరాన్ని కూడా అందజేశారు.
గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నరేష్ కడారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు విద్యాబోధన మరింత సులభంగా, ఆసక్తికరంగా ఉండేందుకు డిజిటల్ దృశ్యశ్రవణ పరికరం ఉపయోగపడుతుందని తెలిపారు.
విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను పంపిణీ చేయడంతో పాటు పాఠశాలకు దృశ్యశ్రవణ పరికరాన్ని అందించడంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాగర్, ఉపాధ్యాయులు, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ సభ్యుడు రోహిత్ తదితరులు పాల్గొన్నారు.











