భైంసా పట్టణంలోని కిసాన్‌గల్లీకి చెందిన తాడేవార్ కరుణాకర్ కుమార్తె తాడేవార్ నిఖిల కొడంగల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. నిఖిలను శాసనసభ్యుడు జి. విట్టల్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. నిఖిల ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫరూక్ హమ్మద్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ భాయ్ రాజన్న, సొసైటీ సీఈవో భూమయ్య, సాయినాథ్, నీలకంఠం, కిసాన్‌గల్లీ కాలనీవాసులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని నిఖిలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎంబీబీఎస్ సీటు సాధించిన నిఖిలకు ఘన సన్మానం
Share:

సారాంశం
భైంసా పట్టణంలోని కిసాన్‌గల్లీకి చెందిన తాడేవార్ కరుణాకర్ కుమార్తె తాడేవార్ నిఖిల కొడంగల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్య విషయాలు
- భైంసా పట్టణంలోని కిసాన్‌గల్లీకి చెందిన తాడేవార్ కరుణాకర్ కుమార్తె తాడేవార్ నిఖిల కొడంగల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు.
- ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
- ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
- విట్టల్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3915ఆర్టికల్స్
4,75,897వ్యూస్









