మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ ఆకాష్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు, వారి విద్యాభివృద్ధికి సహకరించేందుకు గ్రామస్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సురేందర్, మనోజ్, నరేష్, యోగిత, వీఆర్వో విజయ, సీసీ భోజరాం, వీఏఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, ఉపసర్పంచ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.











