నిర్మల్ జిల్లా మండలం భోసి గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, భక్తుల నామస్మరణల మధ్య స్వామివారి శోభాయాత్ర వైభవంగా సాగింది.
పదకొండు రోజులుగా ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడిని నిమజ్జనానికి తరలించే సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పుల మోతలు, భజనలు, భక్తిగీతాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, వృద్ధులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శోభాయాత్రలో భక్తులు గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా అంటూ నామస్మరణ చేశారు. కుటుంబాలకు సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు.
భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీ వరసిద్ధి కర్ర వినాయక స్వామి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. వచ్చే ఏడాది మళ్లీ రావాలి అంటూ భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు.












