పోచంపాడు బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి ఎస్. దిల్వార్ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానాచార్యుడు వి. మహిపాల్‌రెడ్డి తెలిపారు.
సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో దిల్వార్ పాల్గొని ప్రతిభ కనబరిచాడు. అతని అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కారణంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు క్రీడా విభాగం ఏటీపీ ఎం. అశ్విని తెలిపారు.
జాతీయ స్థాయి క్రీడా పోటీలు అక్టోబరు 1 నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో జరుగుతాయని ఉప వార్డెన్ కే. సంతోష్‌కుమార్ తెలిపారు.
జాతీయ స్థాయి పోటీలకు దిల్వార్ ఎంపికయ్యేలా శిక్షణ అందించిన వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు సీహెచ్. సంజీవ్‌ను ఉపాధ్యాయ బృందం అభినందించింది. జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన దిల్వార్కు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.












