మిర్యాలగూడ సెప్టెంబర్ 17 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయిపాఠశాలల క్రీడోత్సవాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుంగపహాడ్ లో ఈనెల18,19 తేదీలలో జరగనున్నాయని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మంగళ తెలిపారు. క్రీడలప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రానున్నారని తెలిపారు. ప్రత్యేకఆహ్వానితులుగా డీఈవో మిర్యాలగూడ ఎంఈఓ ధర్మనాయక్, స్థానిక సర్పంచ్ బేడుదూరి వెంకటరెడ్డి. ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.2026- 27 విద్యా సంవత్సరానికి నల్లగొండ జిల్లా స్థాయి జట్టు ఎంపిక కోసం నియోజకవర్గ స్థాయిలో క్రీడల నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థులను జిల్లా జట్టు ఎంపిక చేస్తారని తెలిపారు. క్రీడల్లో వేము😂లపల్లి, దామరచర్ల , అడవి దేవులపల్లి,మాడుగుల పల్లి మిర్యాలగూడ మండలాల స్థాయిలో ఎంపికైన క్రీడా జట్లు నియోజకవర్గ స్థాయిలో పోటీ పడనున్నాయి. కార్యక్రమంలోనియోజకవర్గ కన్వీనర్ యుగంధర్ రెడ్డి, సీనియర్ వ్యాయమఉపాధ్యాయులు సైదులు,వెంకట్ రెడ్డి శోభా రాణి, దేవేందర్ రెడ్డి, రామ్ రెడ్డి వెంకటయ్య వెంకటరత్నం, షహీద్ అనిల్, రవీందర్ పాఠశాలఉపాధ్యాయులు పాల్గొని క్రీడా ఏర్పాట్లను పర్యవేక్షించారు.












