నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి విజేత యూ. పి. స్కూల్కు చెందిన ఉపాధ్యాయురాలు అంగారి పుష్పలత (హేమ) కు తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయురాలికి అవార్డు లభించినందుకు అభినందనలు తెలిపారు. ఇటువంటి అవార్డులు అందించడం వల్ల ఉపాధ్యాయుల్లో శిక్షణ నైపుణ్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గాడి రాజేశ్వర్, శ్రీధర్, సంగీత, తిరుమల, మమత, ఇందు, సంధ్య, రమ్యతో పాటు విద్యార్థులు ఆమెను అభినందించారు.












