నిర్మల్ పట్టణంలోని సాగర్ కన్వెన్షన్ హాల్లో నుంచి రెండు రోజుల పాటు ఉచిత మెగా ఇంపాక్ట్ శిక్షణ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ నిర్మల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇంపాక్ట్ ఫౌండర్, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డా. గంపా నాగేశ్వర్ రావు నేతృత్వంలో ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. సినీ నటుడు కె.వి. ప్రదీప్, సి.ఎస్.బి. ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత మల్లవరపు, ఆకెళ్ల రాఘవేంద్ర, అప్పాల ప్రసాద్, అమోఘ్ దేశపతితో పాటు సుమారు 20 మంది ప్రముఖ మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించనున్నారు. కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు, ప్రేరణతో పాటు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. డిగ్రీ విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, యువ మహిళలు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి ఎలాంటి రుసుము, ముందస్తు నమోదు అవసరం లేదని, ఆసక్తి ఉన్నవారు నేరుగా సాగర్ కన్వెన్షన్ హాల్‌కు వచ్చి పాల్గొనవచ్చని తెలిపారు. సుమారు 2 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. హాజరయ్యే వారికి మధ్యాహ్నం భోజనం, తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. పాల్గొనేవారు పెన్ను, నోట్‌బుక్ వెంట తీసుకురావాలని సూచించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నిర్మల్ అధ్యక్షుడు వెంకట రమణారెడ్డి, కార్యక్రమం చైర్మన్ ఇప్ప ముత్యం రెడ్డి, ఇంపాక్ట్ రీజియన్ ప్రెసిడెంట్ వాడేకర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, నిర్మల్ ప్రజలకు లభిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, యువ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నిర్మల్‌లో ఉచిత మెగా ఇంపాక్ట్ శిక్షణ కార్యక్రమం
Share:

సారాంశం
నిర్మల్ పట్టణంలోని సాగర్ కన్వెన్షన్ హాల్లో నుంచి రెండు రోజుల పాటు ఉచిత మెగా ఇంపాక్ట్ శిక్షణ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ నిర్మల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
ముఖ్య విషయాలు
- ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
- ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత మల్లవరపు, ఆకెళ్ల రాఘవేంద్ర, అప్పాల ప్రసాద్, అమోఘ్ దేశపతితో పాటు సుమారు 20 మంది ప్రముఖ మోటివేషనల్ స్పీకర్లు పాల్గొని వివిధ అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించనున్నారు.
- కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు, ప్రేరణతో పాటు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
- డిగ్రీ విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, యువ మహిళలు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3763ఆర్టికల్స్
4,61,947వ్యూస్










