జిల్లా స్థాయిలో నిర్వహించిన 14 ఏళ్లలోపు విద్యార్థుల కుస్తీ పోటీల్లో నందిపేట్ అక్షర ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
8వ తరగతికి చెందిన ఎం.డి. అష్వాక్ స్వర్ణ పతకం సాధించగా, శ్రావణి, ఎస్. ఆరాధ్య, పి. హర్షితలు రజత పతకాలు సాధించారు.
జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని పాఠశాల చైర్మన్ డా. శ్రీకాంత్ రామావత్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల ప్రతిభను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది.












