ప్రేమ వివాహాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని, వ్యక్తుల జీవిత భాగస్వామి ఎంపికలో కులం, ఆస్తి కంటే వ్యక్తిత్వం, మనసుకు ప్రాధాన్యం ఇవ్వాలని అంబేడ్కరైట్ మేధావి మూలనివాసి మాలజీ అన్నారు. ప్రతి వ్యక్తికి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని ఆయన పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా మండలం పాలెం గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న ఆరే అరుణ్, ప్రీతి దంపతుల రిసెప్షన్ ఆదివారం స్వగ్రామంలో నిర్వహించారు. ఈ జంటను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు. ఇరు కుటుంబాల సభ్యులు సంతోషంగా కలుసుకుని నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ముంబై నుంచి వచ్చిన మూలనివాసి మాలజీ మాట్లాడుతూ, సమాజంలో కొనసాగుతున్న మూఢాచారాలకు ప్రేమ వివాహాలు సవాలుగా నిలుస్తాయని అన్నారు. ప్రకృతిలోని పక్షుల మాదిరిగా ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామిని స్వేచ్ఛగా ఎంచుకునే హక్కును గౌరవించాలని సూచించారు. నూతన దంపతులు జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గ్రామానికి చెందిన అంబేడ్కరైట్ కార్యకర్తలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని నూతన వధూవరులకు భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుమతిగా అందించి శుభాకాంక్షలు తెలిపారు.
సంప్రదించాల్సిన నంబర్: ఎం. మాలజీ 9869010890.











