మిర్యాలగూడ (మనోరంజని తెలుగుటైమ్స్) మిర్యాలగూడనియోజ కవర్గ ప్రజలసంక్షేమా నికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందనిమిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్ఆర్)అన్నారు. మంగళవారం
మిర్యాలగూడ పట్టణం లోనిఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగానియోజకవర్గానికి చెందిన 200 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.1 కోటి 10 లక్షల 50 వేల విలువైన ముఖ్య మంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు.అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తోందని తెలిపారు.
ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సహాయ కార్యక్రమాలు చేరేలాప్రజాప్రతినిధులు, అధికారులుసమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జావిద్, షబానా అయుబ్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,శ్రేణులు, లబ్ధిదారులుతదితరులు పాల్గొన్నారు.












