ఇంపాక్ట్ మిర్యాలగూడ డైమండ్ క్లబ్ ఆధ్వర్యంలో, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీరింగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న ఇంజనీర్లను సన్మానించారు.
మిర్యాలగూడ నేత్రనిధి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇంపాక్ట్ మిర్యాలగూడ డైమండ్ క్లబ్ అధ్యక్షులు మాశెట్టి శ్రీనివాస్(డైమండ్) అధ్యక్షతన మంగళవారం రాత్రి పట్టణంలోని రైతుబజార్ వద్ద గల డైమండ్ బేకరీ స్వీట్ హౌస్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంజనీరింగ్ రంగానికి విశిష్ట సేవలు అందించిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, వివిధ రంగాలలో పనిచేస్తున్న ఇంజనీర్లకు శాలువాలు, మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఇంజనీరింగ్ రంగానికి విశ్వేశ్వరయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయనను ఇంజనీరింగ్ పితామహుడుగా అభివర్ణిస్తూ ఆయన సేవలను డైమండ్ శ్రీనివాస్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఏ గవర్నర్ వీరపల్లి సతీష్, ఎల్ఈసి ఆఫీసర్ కోటగిరి రామకృష్ణ, క్యాబినెట్ సెక్రటరీ నూనె కిషోర్, క్యాబినెట్ ట్రెజరర్ ఉప్పల వెంకటరమణ, వనితకు వందనం వైస్ ప్రెసిడెంట్ మాశెట్టి గీత డైమండ్, వాసవి క్లబ్ ఆర్సి ఓరుగంటి శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.











