బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు ఆర్డీజీపీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 17న మండల కేంద్రంలోని కుంట గంగారెడ్డి గార్డెన్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోథ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెరుగు భోజన్న, అధికార ప్రతినిధి అలపాటి అచ్చుతానంద రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సచిన్ సావంత్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పార్టీ విధానాలు, ప్రజా పాలన, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాలపై శిక్షణ, దిశానిర్దేశం అందించడంలో ఈ కార్యక్రమం కీలకమని వారు పేర్కొన్నారు.
బోథ్ మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. బోథ్ మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతతో పాల్గొని ఆర్డీజీపీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.












