సారంగాపూర్, 15 November
20062007 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సారంగాపూర్లో ఘనంగా నిర్వహించారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ వేడుకకు అప్పటి హెడ్మాస్టర్ నాగచారి సార్, ఉపాధ్యాయులు సంజీవ్ సార్, రవికుమార్ సార్, రాజు సార్, రమణ సార్ హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించి, వారి ఆశీస్సులు అందుకోవడం పూర్వ విద్యార్థులకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
పాటలు, ఆటలు, సరదాలు, పాత జ్ఞాపకాలతో కార్యక్రమం సందడిగా సాగింది. చివరగా, అందరూ మళ్లీ కలుసుకోవాలనే ఆకాంక్షతో ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.
20 ఏళ్ల స్నేహానికి మరోసారి ప్రాణం పోసిన మధురమైన కలయికగా ఈ గెట్ టుగెదర్ నిలిచింది.






