5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్2026 ముగింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., గారు క్షుణ్ణంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జానకంపేటలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ గ్రౌండ్‌ను సందర్శించి ముగింపు కార్యక్రమానికి సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్లో వేదిక ఏర్పాటు, పరేడ్ నిర్వహణ, క్రీడాకారులు, పోలీస్ అధికారులు, అతిథులు మరియు ప్రేక్షకుల కోసం కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలను సమీక్షించారు.
అధికారులకు సూచనలు
ముగింపు కార్యక్రమానికి విచ్చేసే ఉన్నతాధికారులు, ప్రముఖ అతిథులు మరియు క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి విభాగానికి కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహిస్తూ, కార్యక్రమం ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్రమశిక్షణతో ఘనంగా నిర్వహించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలకు నిజామాబాద్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ముగింపు వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఎ.సి.పి శ్రీ శ్రీనివాస్, బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్.ఐ రమ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయం, నిజామాబాద్.

