ముధోల్, 14 November
ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత, కవి, గాయకుడు సిద్ది పోశెట్టి కన్నుమూశారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. అందమైన పల్లెరా మన ఆష్టా గ్రామం పాటతో తన గ్రామాన్ని రాష్ట్రవ్యాప్తంగా పరిచయం చేసిన పోశెట్టి, గ్రామ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు.
మండలం ఆష్టా గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత, కవి, గాయకుడు సిద్ది పోశెట్టి కన్నుమూశారు. ఆయన మృతి వార్తతో ఆష్టా గ్రామంలో విషాదం నెలకొంది.
అందమైన పల్లెరా మన ఆష్టా గ్రామం అనే పాటతో తన గ్రామాన్ని రాష్ట్రవ్యాప్తంగా పరిచయం చేసిన పోశెట్టి, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. గ్రామంలో అన్నభావు సాఠే విగ్రహ ఏర్పాటుకు ఆయన విశేష కృషి చేశారు.
ఆయన మృతి పట్ల సర్పంచ్ లావణ్యతో పాటు గ్రామస్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కవి, గాయకుడిగా గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చిన సిద్ది పోశెట్టి మృతి తీరని లోటు అని వారు పేర్కొన్నారు.

