భైంసాలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా, గాంధీగంజ్లో నిర్వహించిన మార్కెట్ గణేష్ హారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నర్సింహానగర్లోని హిందూ వీర్ యువసేన గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి, కౌన్సిలర్లు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాముతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.











