బైంసా పట్టణంలోని గణేష్ నగర్లో రైతులు, పట్టణ ప్రజల ఆధ్వర్యంలో బలరామ దేవుని జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నగర్ రైతులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, బలరామ దేవునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల కార్యదర్శి రావుల శివ, గణేష్ నగర్ అధ్యక్షుడు తోట రాములు, ఆకుల నరేష్, కొట్నాగు రాములు, పలువురు రైతులు, భారతీయ కిసాన్ సంఘ్ కార్యకర్తలు పాల్గొన్నారు.











