జిల్లా బాసరలోని వేదభారతి పీఠం ఆధ్వర్యంలో, వేద విద్యానంద గిరి స్వామీజీ సహకారంతో గోపూజ, రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోహారతి వంటి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు గోహారతి ఇచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గోమాత అనుగ్రహంతో రుణబాధలు, సకల దోషాలు తొలగిపోయి సత్సంతానం, శీఘ్ర కల్యాణం, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతాయని వేద పండితుడు గురుచరణ్ తెలిపారు. గతంలో బాసర గోదావరి నది తీరంలో నిరంతరాయంగా నిర్వహించిన గంగాహారతి మాదిరిగానే, బాసర వేద విద్యాలయంలో ప్రతి శనివారం గోహారతి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీశ్రీశ్రీ వేద విద్యానంద గిరి స్వామీజీ, బాసరలో వేదభారతి పీఠం అభివృద్ధి ట్రస్టును ఏర్పాటు చేసి, వేద పాఠశాలతో పాటు గోశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేదాల విశిష్టతను వివరిస్తూ స్వామీజీ రచించిన ప్రతి ఇంటింటా వేదం పుస్తకాన్ని, శ్లోకాలు మరియు సంకల్పంతో ప్రతి ఇంటికీ చేర్చడమే తమ సంకల్పమని నిర్వాహకులు పేర్కొన్నారు.
బాసరలో ఘనంగా గోపూజ, రుద్రాభిషేకం
Share:

సారాంశం
ఆధ్యాత్మికం
ముఖ్య విషయాలు
- జిల్లా బాసరలోని వేదభారతి పీఠం ఆధ్వర్యంలో, వేద విద్యానంద గిరి స్వామీజీ సహకారంతో గోపూజ, రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోహారతి వంటి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
- గోమాత అనుగ్రహంతో రుణబాధలు, సకల దోషాలు తొలగిపోయి సత్సంతానం, శీఘ్ర కల్యాణం, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతాయని వేద పండితుడు గురుచరణ్ తెలిపారు.
- ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు గోహారతి ఇచ్చారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3772ఆర్టికల్స్
4,63,479వ్యూస్









