ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పట్టణంలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని గాంధీచౌక్ లో గల తిలక్ యూత్ గణేష్ మండలి నంబర్ 35 ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
అహర్నిశలు దేశం కోసం శ్రమిస్తూ, 25 ఏళ్లుగా ప్రజాసేవకే అంకితమై, కోట్లాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పట్టణంలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని గాంధీచౌక్ లో గల తిలక్ యూత్ గణేష్ మండలి నంబర్ 35 ఆధ్వర్యంలో సామాజిక సేవే లక్ష్యంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. తమ విలువైన రక్తాన్ని దానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు సహకరించారు.
రక్తదానం చేయడం నిజమైన మానవతా సేవ అని నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిలక్ యూత్ సభ్యులు, రక్తదాతలు పాల్గొన్నారు.












