జిల్లా రత్నాపూర్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా రత్నాపూర్ కాలనీలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రత్నాపూర్ కాండ్లి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం సభ్యులు తెలిపారు.
ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చుట్టుపక్కల కాలనీల నుండి వచ్చిన భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులందరికీ కడుపు నిండా అన్నదానం చేశారు. భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.అన్నదానం మించిన దానం లేదని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని మున్నూరు కాపు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.












