హైదరాబాద్, 9 September
ప్రస్తుతం వర్షాలు లేక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన ప్రజాప్రతినిధులు రాజకీయ పంచాయితీలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని బీజేపీ తాలూకా ధార్మిక సెల్ కన్వీనర్ పసుల నర్సింహ యాదవ్ అన్నారు.
*రాజకీయ పంచాయితీలను పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి* *బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల* *పంచాయితీలతో ప్రజలు విసిగిపోతున్నారు* —*బీజేపీ తాలూకా ధార్మిక సెల్ కన్వీనర్ పసుల నర్సింహ యాదవ్* ప్రస్తుతం వర్షాలు లేక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన ప్రజాప్రతినిధులు రాజకీయ పంచాయితీలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని బీజేపీ తాలూకా ధార్మిక సెల్ కన్వీనర్ *పసుల నర్సింహ యాదవ్* అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీని వేదికగా ఉపయోగించాల్సింది పోయి, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఆరోపణలు, రాజకీయ పంచాయితీలకు దిగడం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు. రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తుంటే, ప్రజలు తమ నిత్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే.. వాటిపై దృష్టి పెట్టకుండా మీరు చేసుకుంటున్న రాజకీయ పంచాయితీలను చూసి ప్రజలు 🙅 అసహించుకుంటున్నారని అన్నారు. రాజకీయాలు కాదు.. ప్రజా సమస్యలే ప్రాధాన్యం కావాలి. ప్రజల కోసం పనిచేసి, వారి సమస్యలను అసెంబ్లీలో బలంగా ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని *పసుల నర్సింహ యాదవ్* సూచించారు.. KP












