మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
బీజేపీలో చేరడం తన రాజకీయ జీవితంలో చారిత్రాత్మక తప్పిదమని, ఇకపై ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని యువ నాయకుడు పసుపుల ప్రశాంత్ స్పష్టం చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు, బీజేపీ సిద్ధాంతాలకు పొంతన లేదని, రాజకీయ పరిస్థితుల కారణంగా ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో అందే బాబన్న తనను పార్టీలోకి ఆహ్వానించడంతో చేరానని తెలిపారు.
బీజేపీలో చేరడం తన రాజకీయ జీవితంలో తాను చేసిన చారిత్రాత్మక తప్పిదమని, ఇకపై బీజేపీ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని యువ నాయకుడు పసుపుల ప్రశాంత్ స్పష్టం చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు, బీజేపీ సిద్ధాంతాలకు పొంతన లేదని ఆయన అన్నారు. రాజకీయ పరిస్థితుల కారణంగా ఒంటరిగా మిగిలిపోయిన సమయంలో అందే బాబన్న తనను బీజేపీలోకి తీసుకురావడంతో, ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక బీజేపీలో చేరానని తెలిపారు. నేను తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు సమర్థించుకోలేకపోతున్నాను. పార్టీలో చేరిన తర్వాత అక్కడి రాజకీయ వాతావరణంలో ఇమడలేకపోయాను. నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణ కోరుతున్నాను అని పసుపుల ప్రశాంత్ అన్నారు. అందే బాబన్నపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని, ఆయనంటే గౌరవం ఉందని స్పష్టం చేశారు. బాబన్నా.. నన్ను పార్టీలోకి తీసుకొచ్చినందుకు థాంక్ యూ. మీపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు. మీంటే నాకు గౌరవం ఉంది. కానీ రాజకీయంగా బీజేపీలో కొనసాగడం మాత్రం నా వల్ల కావడం లేదు అని పేర్కొన్నారు.
తనను పార్టీలోకి తీసుకొచ్చి నమ్మించి మోసం చేశారనే భావన తనలో ఉందని, ఈ అనుభవం తీవ్రంగా బాధించిందని తెలిపారు. అయితే ఈ విషయాన్ని వ్యక్తిగత వివాదంగా మార్చడం తనకు ఇష్టం లేదన్నారు. రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం.. కొన్ని నిర్ణయాలు మన జీవితానికి పాఠాలుగా మారతాయి. బీజేపీలో చేరడం కూడా నాకు అలాంటి ఒక పాఠమే. తప్పు జరిగిందని అంగీకరించడానికి నేను వెనుకాడను. నా నిర్ణయం వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలి అని పసుపుల ప్రశాంత్ అన్నారు. ఈ రోజు నుండి నాకు బీజేపీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. ఇకపై నా రాజకీయ ప్రయాణం ఏ దిశగా సాగాలనే నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటాను. నన్ను నమ్మిన ప్రజలు, నా వెంట నిలిచిన మిత్రులు, కార్యకర్తలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని పసుపుల ప్రశాంత్ స్పష్టం చేశారు. గతంలో తనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ, తనను అభిమానించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు.












