ఎర్రవల్లి, తెలంగాణ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 09
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలో శుద్ధి పేరుతో దళితులను అవమానించారని సీఎం ఆరోపించారు.
కేసీఆర్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలి: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రవల్లిలో ‘శుద్ధి’ పేరిట దళితులను అవమానించారని ఆరోపించారు. అసెంబ్లీ తొలిరోజు జరిగిన ఘటనపై స్పందించిన సీఎం ప్రత్యేక విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా విజయ్ కుమార్ను నియమించినట్లు సభలో వెల్లడించారు. ఘటనకు బాధ్యులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












